MY VOTE IS NOT FOR SALE -PAMPHLET-ఓటును నమ్ముకోండి - నోటుకు అమ్ముకోకండి

ఓటర్లను చైతన్య పరచాలనే ఉద్దేశ్యంతో కవి ,ఇండియన్ హైకూ క్లబ్ వ్యవస్థాపకులు ,అధ్యాపకుడు డా. తలతోటి పృథ్వి రాజ్ ప్రజాస్వామ్య హితాన్ని కాంక్షిస్తూ "ఓటును నమ్ముకోండి - నోటుకు అమ్ముకోకండి "అనే శీర్షికతో కరపత్రాన్ని రచించి ముద్రించి వివిధ ప్రాంతాలలో ఓటరులకు పంచి తనవంతు చైతన్య పరిచాడు . మరీముఖ్యంగా సింహాద్రి రైల్లో పంచడం జరిగింది . పృథ్వి రాజ్ రూపొందించిన కరపత్రాన్ని జనవిజ్ఞాన వేదిక , అనకాపల్లి సభ్యులు ఆవిష్కరిస్తున్న దృశ్యం పృథ్వి రాజ్ రూపొందించి ముద్రించిన కరపత్రాలను పంచుతూ ఓటువిలువను చాటుతున్న జనవిజ్ఞాన వేదిక సభ్యులు *ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయండి.* *ప్రజలకు జన విజ్ఞాన వేదిక పిలుపు.* మద్యం, నగదు పంపిణీ వంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జనవిజ్ఞాన వేదిక జాతీయ వర్కింగ్ జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి శంకర ప్రసాద్ పిలుపునిచ్చారు. కశింకోట మండలం కన్నూరుపాలెం ఉదయపు సంతలో జన విజ్ఞాన వేదిక విశాఖ జిల్లా కమిటీ వినూత్నంగా నిర్వహించిన ఓటరు అవగాహనా...